హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ ఘాట్‌ను పరిశీలించిన ఆరూరి

HNK: ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి గ్రామంలోని బతుకమ్మ ఘాట్‌ను వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పరిశీలించారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలకు ఇబ్బందులు కలగకుండా తాగునీరు, విద్యుత్ దీపాలు, పారిశుధ్యం, భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. వేడుకలు ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్థానిక సర్పంచ్ ఆడెపు స్రవంతి-దయాకర్‌కు తెలిపారు.