హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేములవాడలో శానిటేషన్ డ్రైవ్ ప్రారంభం

SRCL: బతుకమ్మను పురస్కరించుకుని వేములవాడలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పనులను మంగళవారం మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు పరిశీలించారు. రోడ్లలో చెత్త పేరుకుపోకుండా తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. పండుగను ప్రజలు పరిశుభ్ర వాతావరణంలో జరుపుకోవాలని, చెత్తను రోడ్లపై వేయకుండా స్వచ్ఛ ఆటోలకు ఇవ్వాలని కోరారు.