హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి నూతన ఆలయ నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అధికారులు పాల్గొన్నారు.