హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీ కుర్చీలు

MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సమయం దాటినా వైద్యులు, సిబ్బంది విధులకు హాజరు కావడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పేదలు, చిన్నపిల్లల తల్లులు, వృద్ధులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. అధికారులు స్పందించి వైద్య సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.