ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి అక్రమ సాగు, రవాణాపై ఇప్పటివరకు 61 కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపారు. ఈ కేసుల్లో 142 మంది ప్రమేయం ఉండగా, 118 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. సుమారు 10 కిలోల ఎండు గంజాయితో పాటు 2,536 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
జిల్లాలో 61 గంజాయి కేసులు నమోదు: ఎస్పీ


