హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'మాధవ నగర్ ROB పనులు పూర్తి చేయాలి'

NZB: మాధవ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ నగర అభివృద్ధి కమిటీ మంగళవారం ROB వద్ద ధర్నా నిర్వహించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు నత్తనడకన సాగుతున్నాయని నగర అభివృద్ధి కమిటీ గౌరవాధ్యక్షుడు దీకొండ యాదగిరి ఆరోపించారు. రోజూ 42 నుంచి 50 రైళ్లు వెళ్లడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోందని ఆయన తెలిపారు.