BHPL: మల్హర్‌రావు మండలం రుద్రారం గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పంటలను కాపాడుకునేందుకు విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ గ్రామంలోని సబ్‌స్టేషన్ వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలు కళ్ల ముందే ఎండిపోతుంటే అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వెలిబుచ్చారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: రుద్రారం సబ్‌స్టేషన్ వద్ద రైతుల నిరసన


