హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళ్యాణ లక్ష్మితో పేదింటికి ఆర్థిక భరోసా: MLA పాయల్

ADB: కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలతో పేదింటి కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మున్సిపల్ ఛైర్మన్ బండారి అనూషతో కలిసి పంపిణీ చేశారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.