హైదరాబాద్: 28°C
తెలంగాణ

కృష్ణలో మొరం అక్రమ రవాణా

NRPT: కృష్ణ మండలంలో మొరం అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జేసీబీలతో తవ్వకాలు చేపట్టి, టిప్పర్ల ద్వారా రోజూ పెద్ద ఎత్తున మొరం తరలిస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.