హైదరాబాద్: 28°C
తెలంగాణ

పశువుల వైద్యం కోసం రైతుల పడిగాపులు

NGKL: వంగూరు మండల కేంద్రంలోని పశువుల ఆసుపత్రి వద్ద పశువులకు చికిత్స చేయించేందుకు వచ్చిన రైతులు, పశుపోషకులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఉదయం నుంచే ఆసుపత్రికి చేరుకున్నా నిరీక్షణ తప్పడం లేదని తెలుస్తోంది. పశువుల ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న రైతులకు సకాలంలో వైద్యం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.