NLG: నల్గొండ పట్టణ శివారులోని చందనపల్లి చెత్త డంపింగ్ యార్డులో తరచూ మంటలు చెలరేగి దట్టమైన పొగ వ్యాపిస్తోంది. విషపూరిత పొగతో సమీప ప్రాంతాల ప్రజలు, వాహనదారులు శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ చెత్త కాలుతుండటంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డును వేరే చోటుకి మార్చాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
చందనపల్లి డంపింగ్ యార్డ్‌తో స్థానికుల అవస్థలు


