హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమీకృత పాఠశాల నిర్మాణ పనుల పరిశీలన

KMR: మద్నూర్ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న సమీకృత పాఠశాల భవన పనులను మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మంగళవారం మండల నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ నాణ్యతపై కాంట్రాక్టర్లు, అధికారులకు పలు సూచనలు చేశారు. భవన నిర్మాణంలో క్యూరింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. నాణ్యత ప్రమాణాలతో బిల్డింగ్‌ను సకాలంలో పూర్తి చేయాలని ఆయన కాంట్రాక్టర్లకు సూచించారు.