హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టరేట్ ఎదుట NHM ఉద్యోగుల ధర్నా

కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట NHM ఉద్యోగులు మంగళవారం ధర్నా నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించి క్రమబద్ధీకరించాలని కోరారు. 180 రోజుల ప్రసూతి సెలవులు, రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా, EHS, ESI సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ PRC బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.