హైదరాబాద్: 28°C
తెలంగాణ

షార్ట్ ఫిలిం, ఫోటోగ్రఫీ పోటీలకు ఆహ్వానం

ADB: పోలీస్ ఫ్లాగ్ డే (అమరవీరుల దినోత్సవం) సందర్భంగా యువత, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు షార్ట్ ఫిలిం, ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవారం తెలిపారు. పోలీసు సేవలపై రూపొందించిన వీడియోలు, ఫోటోలను అక్టోబర్ 23లోపు జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేయాలని కోరారు. విజేతలకు బహుమతులు అందజేసి రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామని తెలిపారు.