హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులకు మేయర్ శంకుస్థాపన

కరీంనగర్ 64వ డివిజన్ ముకరాంపురలో రూ.10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు మేయర్ కోలగాని శ్రీనివాస్ మంగళవారం శంకుస్థాపన చేశారు. డివిజన్ అభివృద్ధికి UDF నిధుల కింద రూ.50 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. వరద ముప్పును నివారించేందుకు డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పడాల శ్రీజ, స్థానికులు పాల్గొన్నారు.