హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

BDK: చర్ల ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు 36 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామని ఆయన స్పష్టం చేశారు.