హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలుడిపై వీధి కుక్కల దాడి

MNCL: బెల్లంపల్లి పట్టణం, టేకులబస్తీకి చెందిన ఓ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. బాలుడు ఇంటి ముందు ఉండగా ఒక్కసారిగా వీధి కుక్కలు దాడి చేశాయి. కాలుకు తీవ్ర గాయం కావడంతో కుటుంబీకులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కుక్కల నివారణకు అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని బస్తీ వాసులు డిమాండ్ చేశారు.