హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జనగణనలో తప్పులు లేకుండా చేయాలి'

WNP: జనగణన- 2027లో ప్రతి ఒక్కరి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఛార్జ్ క్లర్కులు, సాంకేతిక సహాయకులకు నిర్వహించిన రెండు రోజుల శిక్షణలో ఆమె మాట్లాడారు. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు సమగ్ర శిక్షణ అందించి, ఏ ఇల్లు గణన పరిధి నుంచి తప్పిపోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.