హైదరాబాద్: 28°C
తెలంగాణ

CEIR ద్వారా 115 సెల్‌ఫోన్ల రికవరీ: ఎస్పీ

NRML: జిల్లాలో పోలీసులు CEIR పోర్టల్‌ ద్వారా తాజాగా 115 సెల్‌ఫోన్లను రికవరీ చేశారు. నేడు వాటిని బాధితులకు అందజేశారు. వీటి విలువ సుమారు రూ.13.80 లక్షలు ఉంటుందని ఎస్పీ జి. జానకి షర్మిల తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 2,492 సెల్‌ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించినట్లు పేర్కొన్నారు. మొబైల్‌ ఫోన్లు పోగొట్టుకున్నవారు CEIR పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.