హైదరాబాద్: 28°C
తెలంగాణ

అగ్నిప్రమాద బాధితురాలికి ఫౌండేషన్ అండ

VKB: యాలాల మండలం రాస్నం గ్రామంలో షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైన కుమ్మరి బుచ్చమ్మ కుటుంబాన్ని కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ ఆదుకుంది. ఫౌండేషన్ ప్రతినిధులు అక్బర్ బాబా, ప్రకాష్ గౌడ్ బాధితురాలిని పరామర్శించి నిత్యావసర సరుకులు అందజేశారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటామని భరోసా ఇస్తూ, ప్రభుత్వాన్ని కూడా ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.