హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాదేపల్లి మార్కెట్లో రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు

MBNR: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ గ్రెయిన్ మార్కెట్ యార్డులో అక్టోబర్ 14 నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ప్రతి బుధ, శనివారాల్లో ప్రైవేట్ వ్యాపారుల ద్వారా క్రయవిక్రయాలు నిర్వహించనున్నట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి అశ్వక్ హైమద్ తెలిపారు. రైతులు తమ పత్తిని నిర్ణీత రోజుల్లో మార్కెట్ యార్డుకు తీసుకురావాలని సూచించారు.