NLG: శ్రీశైలం నుంచి సాగర్కు వస్తున్న వరద తగ్గుముఖం పట్టింది. ఎగువ నుంచి ప్రస్తుతం 6,796 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు నుంచి 11,634 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎడమ కాలువకు 6,173, ఎస్సెల్బీసీకి 1,500, వరద కాలువకు 600 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్ నీటిమట్టం 540.10 అడుగులు, నీటి నిల్వ 188.5350 టీఎంసీలుగా ఉంది.
తెలంగాణ
సాగర్‌కు స్వల్పంగా కొనసాగుతున్న వరద


