హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీశైలం జలాశయంలో పూడిక తీత పనులు ఎప్పుడో..?

NGKL: అమ్రాబాద్ మండలం పాతాళగంగ సమీపంలోని శ్రీశైలం జలాశయంలో ఏళ్ల తరబడి పూడిక పేరుకుపోతోంది. వరదలతో కొట్టుకొచ్చిన బురద, ఒండ్రుమట్టి, ఇసుక మేటలు నీటి నిల్వ సామర్థ్యంపై ప్రభావం చూపే ఆందోళన కలిగిస్తున్నాయి. చెత్త, మట్టి తొలగింపు సవాలుగా మారింది. జలాశయాన్ని కాపాడి, భవిష్యత్తులో నీటి అవసరాలకు ఇబ్బందులు రాకుండా పూడిక తీత చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.