హైదరాబాద్: 28°C
తెలంగాణ

బావిలో యువకుడి మృతదేహం లభ్యం

ASF: రెబ్బెన మండలం నారాయణపూర్ గ్రామ సమీపంలోని బావిలో మంగళవారం వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు మృతుడిని గ్రామానికి చెందిన పల్లె పల్లె సాయికిరణ్‌గా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రెబ్బెన ఎస్సై వెంకటకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు SI తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.