హైదరాబాద్: 28°C
తెలంగాణ

NHM-JAC ఆధ్వర్యంలో సమ్మె ప్రారంభం

KMR: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జాతీయ ఆరోగ్య మిషన్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతుల్లో పనిచేస్తున్న సిబ్బంది NHM-JAC ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె ప్రారంభించారు. కలెక్టరేట్ సముదాయంలోని ధర్నా చౌక్ వద్ద సమ్మె మొదటి రోజులో భాగంగా రిలే దీక్షల్లో వైద్య సిబ్బంది కూర్చున్నారు. ఇతర సిబ్బంది మద్దతు పలికారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలన్నారు.