హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా అమ్మవారి విగ్రహం

NRML: నర్సాపూర్ జి(M) కేంద్రంలో జై దుర్గాభవాని కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. సాయికృష్ణ అనే కళాకారుడు వ్యర్థాలుగా మారే పేపర్, గడ్డితో దుర్గా భవాని అమ్మవారి విగ్రహాన్ని తయారు చేశారు. గత కొన్నేళ్లుగా పర్యావరణహిత విగ్రహాలను తయారు చేస్తున్న ఈ యువ కళాకారుడు, ఈసారిగా పూర్తిగా పర్యావరణానికి హాని కలగని విగ్రహాన్ని తీర్చిదిద్ది అందరి ప్రశంసలు అందుకున్నారు.