హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘సమస్యల పరిష్కారంలో ఏఐటీయూసీ విఫలం’

MNCL: సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ పూర్తిగా విఫలమైందని ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ నాయకులు రాంశెట్టి నరేందర్ ఆరోపించారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుర్తింపు హోదా కలిగి కార్మికుల హక్కులు సాధించకుండా ప్రతిపక్షం మాదిరిగా ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.