హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిపై యువకుడి వినూత్న అభిమానం

RR: కొందుర్గు మండలం చిన్న ఎల్కిచర్ల గ్రామానికి చెందిన BRS యువ నాయకుడు లక్ష్మణ్, MLC నవీన్ రెడ్డిపై తనకున్న అపారమైన అభిమానాన్ని చాటుకున్నాడు. నవీన్ రెడ్డి చిత్రపటాన్ని ఏకంగా తన గుండెలపై టాటూగా వేయించుకుని వినూత్నరీతిలో ప్రేమను వ్యక్తపరిచాడు. ఈ అరుదైన ఘటన స్థానికంగా చర్చనీయాంశం కావడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, శ్రేణులు అతన్నిఅభినందిస్తున్నారు.