హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజన్న ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రోత్సవాలు!

SRCL: వేములవాడ రాజన్న ఆలయంలో శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 3వ రోజైన అశ్వయుజ శుద్ధ విదియ అమ్మవారు "చంద్ర గంట అలంకరణ అలంకారంలో" దర్శనమిచ్చారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి పూజా కార్యక్రమాలను అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా శాస్త్రోక్తంగా నిర్వహించగా, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని మండపంలో అమ్మవారికి ప్రత్యేక దర్శనాలు, పూజా ఏర్పాట్లు చేశారు.