హైదరాబాద్: 28°C
తెలంగాణ

జమ్మికుంటలో ఆకాశాన్ని తాకిన పత్తి ధర!

KNR: జమ్మికుంట మార్కెట్‌లో పత్తి ధర రికార్డు సృష్టించింది. క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.9,090 పలికింది. కనీస మద్దతు ధర రూ.8,667 కాగా, వ్యాపారులు పోటీపడి రూ.423 అదనంగా చెల్లించారు. సీజన్ ముగిసేదాకా మద్దతు ధరకంటే తగ్గకుండా అధికారులు చూడాలని రైతులు కోరుతున్నారు.