హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్‌లో ఘనంగా దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని చైతన్యపురి కాలనీలో శ్రీ మహాశక్తి దేవాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మూడో రోజు మంగళవారం అన్నపూర్ణాదేవి, చంద్రఘంట అవతారంలో శాకంభరి అలంకరణతో అమ్మవారు దర్శనమిచ్చారు.