హైదరాబాద్: 28°C
తెలంగాణ

అదృశ్యమై.. చెరువులో శవమై

SDPT: దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామంలో అదృశ్యమైన వ్యక్తి నేడు చెరువులో శవమై తేలాడు. గ్రామానికి చెందిన ముదిరాజ్ సిద్ధిరాములు(35) ఆదివారం నుంచి కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున గ్రామ శివారులోని చెరువులో సిద్ధిరాములు మృతదేహం కనిపించింది. చేపల వేటకు వెళ్లిన క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెంది ఉండవచ్చని గ్రామస్తులు తెలిపారు.