హైదరాబాద్: 28°C
తెలంగాణ

కౌకూర్ బాలిక హత్య.. గార్డు అరెస్టు

MDCL: కౌకూర్ ఆర్కిడ్ విల్లాలో ఐదేళ్ల బాలిక హత్య కేసులో నిందితుడైన సెక్యూరిటీ గార్డు విక్రమ్ కుమార్‌ను మల్కాజిగిరి పోలీసులు బోరబండలో అరెస్టు చేశారు. హత్య తర్వాత తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేసిన అతను బిహార్ పారిపోయేందుకు యత్నించాడని పోలీసులు తెలిపారు. 15 బృందాలు 24 గంటలు మఫ్టీలో గాలించి పట్టుకున్నాయి.