హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి: కలెక్టర్

JN: రబీ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున, రైతులు వరి సాగుకు బదులుగా పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలను సాగు చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా సూచించారు. సోమవారం చిటకొడూరు గ్రామంలో రైతు నేస్తం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నేల స్వభావం, రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించాలని అధికారులను ఆదేశించారు.