హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటి కోసం ఎండిన కుంటలో రైతుల నిరసన

NRML: కడెం మండలం పెద్దూర్ తండా రైతులు మంగళవారం ఉదయం ఎండిన కుంటలో దిగి నిరసన తెలిపారు. సదర్‌మాట్ కాలువ చివరి ఆయకట్టుకు నీరు అందక పంటలు ఎండుతున్నాయని, నీరు రాకపోతే పెట్టుబడులు దక్కక అప్పులపాలవుతామని వాపోయారు. వెంటనే నీరు విడుదల చేయాలని కాలువ సాధన సమితి అధ్యక్షుడు రాజేందర్ హపావత్ డిమాండ్ చేశారు. లావుడ్య గంగన్న, భుక్య శేఖర్, తదితరులు పాల్గొన్నారు.