హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దసరా సెలవుల్లో దొంగతనాలపై అప్రమత్తంగా ఉండాలి'

SRCL: దసరా సెలవుల్లో సొంతూళ్లు, బంధువుల ఇళ్లకు వెళ్లేవారు దొంగతనాల నివారణకు జాగ్రత్తలు పాటించాలని చందుర్తి సీఐ రవీందర్ సూచించారు. ఇళ్లను ఖాళీగా వదిలి వెళ్లేటప్పుడు బంగారం, నగదును భద్రపరుచుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ప్రయాణ వివరాలను సోషల్ మీడియాలో వెల్లడించవద్దని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు 100కు సమాచారం ఇవ్వాలన్నారు.