BHPL: జిల్లా అభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్ చేసిన కృషి మరువలేనిదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కొనియాడారు. జిల్లా ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా మూడో రోజు కోర్టు, ఎస్పీ కార్యాలయం, కలెక్టరేట్, మెడికల్ కాలేజీలను సందర్శించి అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. సమీకృత కలెక్టరేట్, మెడికల్ కాలేజీ, ఆసుపత్రి వంటి సంస్థలతో జిల్లా అభివృద్ధి చెందిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధిపై మరింత దృష్టి సారించాలని కోరారు.
తెలంగాణ
జిల్లా అభివృద్ధిలో కేసీఆర్ కృషి మరువలేనిది: మాజీ ఎమ్మెల్యే


