హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాలనీ రోడ్లపై మురుగునీరు.. ప్రజలకు ఇబ్బందులు

ASF: రెబ్బన మండల కేంద్రంలోని బృందావనం కాలనీలో డ్రైనేజీ వాటర్ పూర్తిగా కాలనీలోకి ప్రవహిస్తున్నాయి. దీంతో గృహాల ముందు ఉన్న రహదారిపై మురుగునీరు ప్రవహించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు,వృద్ధులు ఈ రహదారి వెంబడి వెళ్లాలంటే ఎక్కడ జారిపడతామోనని ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరారు.