హైదరాబాద్: 28°C
తెలంగాణ

రంగు మారిన మిషన్ భగీరథ నీళ్లు..!

NZB: భీంగల్ నియోజకవర్గాల్లోని పలు గ్రామాలకు మిషన్ భగీరథ నీరు పసుపు రంగులో సరఫరా అవుతోందని, అప్పుడప్పుడు పురుగులు కూడా వస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కావడం లేదని వాపోతున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి స్వచ్ఛమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.