అన్నమయ్య: జిల్లాలోని పెద్దమండ్యం మండలం పాపేపల్లి క్రాస్ వద్ద మంగళవారం ఉదయం రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికుల ఆటోలో ఉన్న పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
రెండు ఆటోలు ఢీ.. పలువురికి గాయాలు


