హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సొంత నిధులతో పారిశుధ్య పనులు

SKLM: కొత్తూరు మండలం గురండిలో మాజీ సర్పంచ్ బోర సింహాద్రి నాయుడు సొంత నిధులతో పారిశుధ్య పనులు చేపట్టారు. వీధుల్లో మురుగు కాలువల్లో చెత్త పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో మంగళవారం పనులు ప్రారంభించారు. గ్రామంలోని అన్ని వీధుల కాలువలను శుభ్రం చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు. సొంత నిధులతో పనులు చేపట్టడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.