హైదరాబాద్: 28°C
తెలంగాణ

హరీశ్‌రావు మామకు హైకోర్టులో ఊరట

SDPT: వెలికట్టలో మాధవరపు హన్మంతరావుకు చెందిన 3.22 ఎకరాల భూమి విషయంలో బలవంతపు చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2010లో కొనుగోలు చేసిన ఈ భూమిపై రెవెన్యూ షోకాజ్ నోటీసు ఇవ్వగా, చట్టబద్ధంగానే కొన్నానని హన్మంతరావు కోర్టును ఆశ్రయించారు. తుది నిర్ణయం వచ్చే వరకు ఎలాంటి చర్యలు వద్దని కోర్టు స్పష్టం చేసింది.