హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: లోవోల్టేజీతో అవస్థలు.. జనరేటర్‌తో పంటకు నీరు

MDK: నర్సాపూర్ నియోజకవర్గం లింగాపూర్ లాలుతండాలో లోవోల్టేజీ సమస్య రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. విద్యుత్ సరఫరా సరిగా లేక బోరు మోటార్లు పనిచేయక వరి పంట ఎండిపోయే దుస్థితి నెలకొంది. దీంతో ఓ రైతు జనరేటర్ సాయంతో మోటర్‌ను నడుపుతూ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు స్పందించి విద్యుత్ సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.