హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కెరమెరి ఘాట్ రోడ్డులో లారీ బోల్తా.. ఇద్దరికి గాయాలు

ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి ఘాట్ రోడ్డులో మంగళవారం లారీ బోల్తా పడింది. స్థానికుల వివరాల ప్రకారం ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న లారీ ఘాట్ మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడిందన్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ లకి గాయాలైనట్లు తెలిపారు. లారీ ప్రమాద విషయంపై స్థానిక పోలీసులకు సమాచారం అందించామని స్థానికులు పేర్కొన్నారు.