హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిడ్ మానేరు రిజర్వాయర్‌లో 23.462 టీఎంసీల నీరు

SRCL: బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద మిడ్ మానేరు రిజర్వాయర్ నీటిమట్టం మంగళవారం ఉదయం 316.35 మీటర్లుగా నమోదైంది. 27.55 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 23.462 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో లేకపోగా, 157 క్యూసెక్కుల నీరు బయటకు విడుదలవుతోంది. స్పిల్‌వే గేట్లు మూసే ఉన్నాయని అధికారులు తెలిపారు.