హైదరాబాద్: 28°C
తెలంగాణ

జమ్మికుంట మార్కెట్లో పత్తికి రికార్డు ధర

KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం పత్తి క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.9,090 ధర పలికింది. కనీస మద్దతు ధర రూ.8,667 కాగా, వ్యాపారులు రూ.423 అదనంగా చెల్లించారు. పత్తికి గిట్టుబాటు ధర లభించడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. సీజన్ ముగిసే వరకు మద్దతు ధర తగ్గకుండా అధికారులు పర్యవేక్షించాలని రైతులు కోరుతున్నారు.