హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరుపయోగంగా బస్టాండ్..!

NGKL: వంగూరు మండల కేంద్రంలో లక్షల రూపాయలతో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ నిరుపయోగంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు బస్టాండ్‌లోకి రాకపోవడంతో ఖాళీగా దర్శనమిస్తుంది. దీంతోపాటు బస్టాండ్‌లో పిచ్చి మొక్కలు పెరిగాయి. సంబంధిత అధికారులు స్పందించి బస్టాండ్‌కు పూర్వ వైభవం తెచ్చి వినియోగంలోకి తీసుకురావాలని స్థానిక ప్రయాణికులు కోరుతున్నారు.