హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇరువర్గాల దాడిలో.. వ్యాపారి మృతి

PDPL: రామగుండం NTPC అన్నపూర్ణ కాలనీలో దారుణం జరిగింది. పాల వ్యాపారి వెంకటేశ్వరరావుపై కొందరు కర్రలతో దాడి చేశారు. ఇరువర్గాల మధ్య జరిగిన గొడవలో తలపై తీవ్ర గాయాలైన వెంకటేశ్వరరావును స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన NTPC పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.