ఆసిఫాబాద్ మండలం రాజంపేట జీపీ ఎదుట కార్మికులు పెండింగ్ వేతనాల కోసం నిరసన చేపట్టారు. కొందరికి 11 నెలలు, జనరల్ ఫండ్ కార్మికులకు 5 నెలలు, ఇతర సిబ్బందికి 6 నెలలుగా వేతనాలు అందడం లేదని జీపీ యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. యూనిఫాంలు, షూస్, సేఫ్టీ కిట్లు ఇవ్వాలని కోరారు. దసరాలోగా సమస్యలు పరిష్కరించకపోతే విధులు బహిష్కరిస్తామన్నారు.
తెలంగాణ
రాజంపేట జీపీ కార్యాలయం ఎదుట కార్మికుల నిరసన


