WNP: రేవల్లి మండలం కొత్త తండా-పాత తండా మధ్య మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీతో చాలాకాలంగా తాగునీరు వృథా అవుతోందని బీజేపీ గిరిజన మోర్చా నేత తిరుపతి నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. వర్షాభావంతో నీటి సమస్యలు పెరుగుతున్న వేళ లీకేజీని వెంటనే అరికట్టాలని, లేకుంటే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.
తెలంగాణ
VIDEO: లీకేజీతో తాగునీరు వృథా..!


